Pawan Kalyan : పోకిరి రికార్డ్స్ ను తిరగరాసిన పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan : సెప్టెంబర్ 2 ఈరోజు గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నేడు ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్, ప్రముఖులు నటీనటీమణులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎంతో మంది పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.. పవన్ బర్త్డే సందర్భంగా తను నటించిన జల్సా, తమ్ముడు సినిమాలను థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురిపించింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలియానా జంటగా నటించిన చిత్రం జల్సా.. ఈ సినిమా 2008 ఏప్రిల్ 2న విడుదల కాగా.. మళ్లీ ఇన్నేళ్ల తరవత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ 4k వెర్షన్ లో విడుదల చేశారు.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలై ఈ సినిమా రికార్డులను తిరగ రాస్తుంది.. భారత సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. ఏకంగా 600 పైగా స్పెషల్ షోలతో జల్సా ట్రెండ్ సెట్ చేసింది.. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు..

Pavan Kalyan jalsa movie 600 shows on Tollwood
Pavan Kalyan jalsa movie 600 shows on Tollwood

మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను కూడా థియేటర్ స్టోరీ రిలీజ్ చేయగా.. ఈ సినిమా మొత్తంగా 380 స్పెషల్ షోలను ప్రదర్శించింది.. ఆ మధ్య మహేష్ అభిమానులు ఈ రికార్డును ఎవ్వరు బ్రేక్ చేయలేరు అని సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు.. ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా 600కు పైగా షోస్ వేసినట్లు తెలుస్తోంది.. మహేష్ పోకిరి రికార్డ్స్ నం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ చేశారు.. అటు కలెక్షన్లతోపాటు ఇటు షోస్ లో కూడా రెండింటిలోనూ పవర్ స్టార్ ముందున్నాడు.. మరి పవర్ స్టార్ క్రియేట్ చేసిన ఈ రికార్డును.. మరోసారి రిరిలీజ్ చేసి ఏ సినిమాలతో ఏ హీరో బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికర విషయంగా మారింది..

Advertisement