Pawan Kalyan : పవర్ గ్లాన్స్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ..!!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఓ పవర్ ఉంది.. ఈయనకు నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నేడు..!! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరముల్లు నుంచి పవర్ గ్లాస్ ను విడుదల చేశారు మేకర్స్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ధరకు ఎక్కుతున్న పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తాజాగా విడుదలైన పవర్ గ్లన్స్ ను చూసిన అభిమానులకు పవర్ఫుల్ ట్రీట్ అందించారు..!

హరిహర వీరముల్లు చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాను తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ పవర్ గ్లాన్స్ లో పవర్ స్టార్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.. మల్ల యోధులతో పవన్ కళ్యాణ్ కుస్తీకి సై అంటూ.. తెలుగోడు తొడగొట్టి మరీ పోరాటానికి దిగుతారు.. మీసం మేలుస్తూ ఒక్కొక్కరిని తన చేతులతో మట్టికరించారు.. వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే దిగొచ్చిండు బళ్ళు బళ్ళున.. పిడుగే దిగొచ్చింది బళ్ళు బళ్ళున.. మెడల్ని వంచి కదలని మార్చి కొలిక్కి తెచ్చి పనేట్టుకొని తొడకొట్టాడో తెలుగోడు అనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వింటుంటే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా ఆ పాట మైండ్ లో నుంచి డిలీట్ కావడం లేదు..

Pavan Kalyan Hari Hara Veera Mallu power glance out now
Pavan Kalyan Hari Hara Veera Mallu power glance out now

అంతగా ఈ పవర్ గ్లాన్స్ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది.. పవర్ గ్లాన్స్ చూసిన అభిమానులు సినీ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ పవర్ గ్లాన్స్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.. పవర్ గ్లాన్స్ హాష్ ట్యాగ్ను ఆయన అభిమానులు హోరెత్తిస్తున్నారు.. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ రామ్ పాల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి..