Pavan Kalyan : “పవన్ మాల” అట్టుంటది మరి పవన్ కళ్యాణ్ అంటే..!

Pavan Kalyan : భవాని మాల.. అయ్యప్ప మాల.. విని ఉంటారు.. కానీ పవన్ మాల గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. అయితే పవన్ మాల ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మాలలు ధరించారు.. ఆయన్ను అమితంగా ప్రేమించే కొందరు ఎలా మెడలో ఎర్ర కండువా వేసుకుని 49 రోజులపాటు దీక్ష చేస్తారు.. ఇంతకీ ఈ దీక్ష ఎందుకు చేస్తారు.? మాల ధరించిన అన్ని రోజులు వీళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనా పర్లేదు..

పవన్ పేరు చెబితే చాలు లక్షల మందికి పూనకాలు వస్తాయి.. ఆ పేరు కి ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పెద్ద పండుగ.. సెప్టెంబర్ 2 న జరిగే ఆయన పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటారు.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు రెండు నెలల నుంచి ఈ సంబరాలు మొదలవుతాయి.. అందుకు నిదర్శనమే ఈ పవన్ మాల.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజుని జరుపుకుంటారు.. ఈ సందర్భంగా పాలకొల్లుకు చెందిన పలువురు యువకులు పవన్ మాల ధరించారు..

Pavan Kalyan fans wear a Pavan mala on her birthday celebration
Pavan Kalyan fans wear a Pavan mala on her birthday celebration

ఈ 49 రోజుల పాటు ఎర్ర కండువాలు ధరించి ప్రజలకు సేవ చేయనున్నట్లు ప్రకటించారు వారు. 49 రోజులపాటు వారు చాలా నిష్టగా ఉంటామని.. అన్నయ్య ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అని.. నీతిగా, నిజాయితీగా ఎలా ఉండాలో అన్నయ్యని చూసి నేర్చుకుంటూ.. వారి అడుగుజాడల్లోనే ఈ 49 రోజులపాటు నడుస్తామని వారు పేర్కొన్నారు.. ఈ మాల గురించి తెలుసుకున్న పవన్ అభిమానులు వారిని ప్రశంసిస్తుంటే.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు..

Advertisement