Pathaan : బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ సంజు సినిమా తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు విరామం తీసుకుని మళ్లీ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకొనే షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ మూవీ బేషరమ్ రంగ్ అనే పాటను విడుదల చేయగా ఈ పాట ద్వారా ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుందని చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే ఇందులో పాడిన కాస్ట్యూమ్స్ మార్చకపోతే సినిమా విడుదలకు అనుమతించేది లేదు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇందులో దీపికా పదుకొనే బోల్డ్ గా.. ఎరోటిక్ గా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాటలో దీపిక బికినీలో కనిపించడమే కాకుండా అది కూడా కాషాయ రంగున్న బికినీలో కనిపించేసరికి సోషల్ మీడియాలో కొంతమంది ఆమెను టార్గెట్ చేస్తున్నారు. హిందూ మతాన్ని అగౌరవపరచడమే లక్ష్యంగా ఇలాంటి దుస్తులు ధరిస్తారా అంటూ కూడా పలువురు నెటిజన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఈ సినిమా విడుదలకు ఇబ్బంది కనిపిస్తోంది . మరి ఈ సినిమా కాస్టమ్స్ మార్చకపోతే మధ్యప్రదేశ్లో అనుమతి ఇస్తారో లేదో చూడాలి.