OTT కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ చిత్రం వారసుడు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో ఈ చిత్రం కూడా నిలిచింది. విజయ్ వారసుడు సినిమా థియేటర్స్ లో చూడటం వీలుపడని వాళ్లు ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు..
విజయ్ వారసుడు సినిమా తమిళంలో జనవరి 11న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకకెక్కిన వారిసు సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన 30 రోజుల గ్యాప్ లోనే ఓటీటీ లో రిలీజ్ చేసేలాగా నిర్మాతతో అమెజాన్ ప్రైమ్ ముందుగానే ఒప్పందం చేసుకున్నారు.
ఆ కారణంగానే ఈ సినిమా ఫిబ్రవరి 10 న అమెజాన్ ప్రైమ్ లో వారిసు స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళం తో పాటు తెలుగు వర్షన్ కూడా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాకింగ్ సొంతం చేసుకుంది. వారీసు సినిమా తమిళంలో అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుంటుంది. తమిళంలో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మైలు రాయిని దాటింది. విజయ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో వారసుడు ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్, రష్మిక గ్లామర్ ఈ సినిమాను ఆ మాత్రం నిలిపాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లను కలెక్ట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అమెజాన్ ప్రైమ్ ఫిబ్రవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే విడుదలైన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.