Ormax : టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరంటే..?

Ormax : సాధారణంగా ప్రతి నెల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ఏ హీరో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.. ఏ హీరో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు అనే జాబితాని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నవంబర్ నెల కు సంబంధించి టాప్ టెన్ మేల్ స్టార్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే నవంబర్ నెలకు సంబంధించి ఆర్మాక్స్ మీడియా రూపొందించిన మేల్ స్టార్ జాబితాలో మొదటి స్థానాన్ని ఎప్పటిలాగే ప్రభాస్ కైవసం చేసుకున్నారు. రెండవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకోవడం గమనార్హం.

Advertisement
ormax-he-is-the-tollywood-no1-hero
ormax-he-is-the-tollywood-no1-hero

మూడవ స్థానాన్ని అల్లు అర్జున్ కైవసం చేసుకోగా.. నాలుగవ స్థానాన్ని మహేష్ బాబు దక్కించుకున్నారు.. ఐదవ స్థానాన్ని రామ్ చరణ్ దక్కించుకోగా ఆయనను అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ ఆరవ స్థానాన్ని దక్కించుకున్నారు.. ఇక తదుపరి స్థానాలలో నాచురల్ స్టార్ నాని, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ 10స్థానాలను సొంతం చేసుకున్నారు. తెలుగులో వీరందరూ టాప్ టెన్ హీరోలు కాగా మిగిలిన హీరోలు కూడా చాలామంది నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే గత నెల అక్టోబరు, నవంబర్ రెండు నెలలకు కూడా ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. డిసెంబర్ నెలకి కూడా ఆయనే మొదటి స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement