“ఒకే ఒక జీవితం” ఓటిటి రిలీజ్ డేట్ అప్పుడే వచ్చేసింది..!

యంగ్ హీరో శర్వానంద్ తన కెరియర్ లో 30 వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ఒకే ఒక జీవితం.. ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో అక్కినేని అమల అమ్మ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.. ఇది ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం.. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తంలో చెల్లించి ఆ ఓటిటీ సంస్థ కొనుగోలు చేసిందట..

Oke oka jeevitam OTT release date out
Oke oka jeevitam OTT release date out

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒకే ఒక జీవితం సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది అని వార్తలు వినిపించాయి.. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లీవ్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందని తెలుస్తోంది. సౌత్ లో ఎబో హిట్ టాక్ ను సంపాదించుకుంటే 11 కోట్లు, అయితే యావరేజ్ అయితే8 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.. ముందు ఈ సినిమా టాక్ ను బట్టి రేట్ ఫిక్స్ అవుతుందట.. అలాగే సినిమా హిట్ అయితే 45 రోజులు తరువాత లేదంటే 30 రోజుల లోపే ఓటిటీలో విడుదల చేసేలా ఒప్పందం కుదిరిందట..

శ్రీ కార్తిక్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్ పై రూపొందిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాలో శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటించింది.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు.. ఈ సినిమా తో శర్వానంద్ ఎమోషనల్ గా కట్టి కట్టిపడేసాడు. అమల కూడా తన నటనకు మెరుగులు దిద్ది బాగా నటించింది.. మిగతా వాళ్ళు వారి పాత్రలకు ప్రాణం పోశారు.. మొత్తానికి మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వసూలు అయినట్టు సమాచారం..

Advertisement