NTR: ఇంటికి వచ్చి మరి రాఖీ కట్టిన నందమూరి సుహాసిని.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

NTR: నేడు రాఖీ పండుగ అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో నందమూరి సుహాసిని రాఖీ పండుగ నాడే జన్మదినం కావడంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక అక్క సుహాసిని తో ఎన్టీఆర్ కి మంచి బాండింగ్ ఉంటుందట. ఇటీవల అక్క కొడుకు శ్రీహర్ష పెళ్లిలో ఎన్టీఆర్ చాలా సందడి చేయడం తెలిసిందే.

పెళ్లిలో అన్ని తానేయుండి రచ్చ రచ్చ చేయడం జరిగింది. ఈ క్రమంలో బర్తడే తో పాటు రాఖీ పండుగ ఒకేరోజు రావడంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి సుహాసిని రాఖీ కట్టడం జరిగిందట. దీంతో ఎన్టీఆర్ బర్తడే గిఫ్ట్ తో పాటు రాఖీ పండుగ కానుకగా.. కొన్ని లక్షల విలువ చేసే గిఫ్ట్ నందమూరి సుహాసిని కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో ఎంతో ట్రేండింగ్ అవుతుంది.

NTR gave an unforgettable gift to Nandamuri Suhasini who came home and tied Rakhi

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. సో ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. రాఖీ పండుగ నాడు తన ఇంటికి వచ్చిన అక్క సువాసినికి అదిరిపోయే గిఫ్ట్ తో పాటు బర్తడే విషెస్ కూడా తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి.