NTR 30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. NTR 30 కీలక ఫైట్..

NTR 30 :  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ను తారక్ ఇచ్చారు.. జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాపై అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓపెన్ అయ్యారు.. కొరటాల శివతో చేయబోయే పాన్ ఇండియా సినిమా గురించి ఫాన్స్ పదేపదే అడగడంతో ..ఈ ఫిబ్రవరిలోనే పూజ చేసి మార్చి 20 లేదా ఆలోపే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోతామని చెప్పారు. కాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ntr-30-movie-beach-fight-seens-highlight-of-enter-movie
ntr-30-movie-beach-fight-seens-highlight-of-enter-movie

ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శుభాకాంక్షలు ఎన్టీఆర్ 30 పేరుతో ఓ పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ హిట్ అందుకున్న ఈ ఇద్దరు నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది .కాగా ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు..

అప్డేట్స్ అప్డేట్స్ అంటూ చాలా కాలంగా ఎదురు చేస్తున్న అభిమానులకు ఉత్సాహాన్ని అందించారు.. బీచ్ సెటప్ వేసి ఓ హెవీ యాక్షన్ సీక్వెన్స్ రూపొందించనున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలవనుందట. ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్ లో చూస్తే ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెన్స్ సినిమాకి అత్యంత కీలకమని.. కథలో ఇక్కడి సన్నివేశాలే మలుపు తిరుగుతాయని సమాచారం.

ఇందుకోసం భారీ సెటప్ వేస్తున్నారని టాక్.. ఎప్పటికే ఎన్టీఆర్ అభిమానుల్ని ప్రేక్షకుల్ని మెప్పించిన కొరటాల ఓ శక్తివంతమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.. ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇలాంటి అప్డేట్స్ రావడంతో ఆ అంచనాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి..