NIharika – Chaitanya : మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య కృష్ణతో విడాకులు వార్త తెగ వైరల్ అవుతూ ఉంది. రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో 2020 డిసెంబర్ 9వ తారీకు ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఈ వివాహ వేడుకలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది నెలలకే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో భర్త జొన్నలగడ్డ చైతన్య కృష్ణ వస్తున్నా వార్తలకీ ఫుల్ స్టాప్ పెడుతూ వీడియో రూపంలో క్లారిటీ ఇవ్వటం జరిగింది. అవన్నీ ఫేక్ వార్తలు అని.. వీడియోలో స్పష్టం చేశారు.
కానీ లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో జొన్నలగడ్డ చైతన్య కృష్ణ తన అకౌంట్ లో నిహారిక ఫోటోలు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. పెళ్లి ఫోటోలతో పాటు ఆమెను కూడా అన్ ఫాలో చేయడం జరిగింది. మెగా ఫ్యామిలీలో అందరిని ఫాలో అవుతున్న చైతన్య కృష్ణ భార్య.. నిహారికనీ ఆన్ ఫాలో చేయటం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరోసారి వీరిద్దరి విడాకులు గురించి వార్తలు గత కొద్ది నెలల నుండి వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే నిహారిక, చైతన్య కృష్ణ తమా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో లాస్ట్ పోస్ట్ లు కింద నెటిజన్స్ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.
డైవర్స్ వార్తలు మరింత వైరల్ అవుతూ ఉండటంతో గతంలో వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చిన చైతన్య కృష్ణ అని సోషల్ మీడియాలో ఆయన పోస్టుల కింద నేటిజన్స్ డైవర్స్ వార్తలపై క్లారిటీ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. మరోపక్క మామిడికాయల సీజన్ రాకముందే.. మామిడి తినాలనిపిస్తుంది అంటూ నిహారిక పెట్టిన పోస్ట్ మరింత వైరల్ అవుతూ ఉంది. దీంతో ఇద్దరి నుండి క్లారిటీ రాబట్టడానికి అభిమానులు.. నెటిజన్స్ వాళ్ళు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన లాస్ట్ పోస్టుల కింద కామెంట్లు చేస్తున్నారు.