Nayanthara : జ్యోతిష్కుడు మాట నిజం అయిందా.. న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ విడాకులు ఖాయ‌మా?

Nayanthara: సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్ నయనతార, రీసెంట్ గా విఘ్నేష్ శివన్ ను పెళ్లాడి నాలుగు నెలలు అవ్వకముందే ట్విన్స్ కు పేరేంట్స్ అయ్యారు. సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. నయనతార తీరుపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. నయన్ పిల్లలపై పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా పంపారు. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని అందుకు సంబంధించిన డాక్యూమెంట్స్ ను ఇచ్చారనే విషయం కూడా తెలిసిందే.

Advertisement

ఇప్పుడు లేటెస్ట్ గా నయన్ దంపతులు మరో వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. విఘ్నేష్ శివన్ తల్లి, సరోగసి ద్వారా పుట్టిన పిల్లలు తమ వంశానికి చెందిన వాళ్లు కాదని అంటున్నారు. నయన్ కోపంతో విఘ్నేష్ కు ఇచ్చిన ఆస్తులకు సంబంధించిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారట. ప్రస్తుతం విఘ్నేష్ కు నయన్ దూరంగా ఉందట. ఇదంతా చూస్తుంటే గతంలో జ్యోతిష్కుడు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. న‌య‌న‌తార‌, విఘ్నేష్ పెళ్లి టైమ్ లో ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నయనతారకు తన జీవితంలో పెళ్లి కలిసిరాదని అన్నారు.

Advertisement
Nayanthara and Vignesh Sivan divorce
Nayanthara and Vignesh Sivan divorce

Nayanthara : విఘ్నేష్ తో అగ్రిమెంట్ క్యాన్సిల్

నయన్ జాతకంలో గురువు నీచ స్థాతిలో ఉన్నాడని, అందుకే ఆమెకు వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదని ఆయన అన్నారు. ఈ క్రమంలో నయనతార దంపతులు త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. అందుకే నయనతార, ప్రభుదేవా నిశ్చితార్ధం అయ్యి కూడా బ్రేక్ అయ్యిందని, ఆ తర్వాత ఆమె అఫైర్లు కూడా బెడిసికొట్టాయని అంటున్నారు. నయనతార పెళ్లైనప్పటి నుండి ఏదొక విషయంలో వివాదానికి గురి కావడం.. ఇప్పుడు విఘ్నేష్ తో కూడా తన వివాహాన్ని బ్రేక్ చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. మరి వేణు స్వామి అనే జ్యోతిష్కుడు చెప్పిన విధంగా నయనతార జీవితం మలుపు తిరగనుందా అనేది చూడాలి.

Advertisement