Nayanatara : మాళవికకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నయనతార..!

Nayanatara : సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార తాజాగా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో నయనతార విగ్నేష్ శివన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కిన చిత్రం కనెక్ట్ .. ఈరోజు ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిన నయనతార తనపై వచ్చిన రూమర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గతంలో మాళవిక మోహనన్ నయనతార ను సినిమాను దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్లను తిప్పికొడుతూ గట్టి కౌంటర్ ఇచ్చింది నయనతార.

Nayanatara gave a strong counter to malavika..!
Nayanatara gave a strong counter to malavika..!

సినిమాలో హాస్పటల్ సీన్ లో మేకప్ తో నటించడం పై తనను ఆటపట్టించారని.. ఆ ఇంటర్వ్యూలో తన మేకప్ గురించి చులకనగా మాట్లాడారని గుర్తుచేసుకుంది నయనతార. ఆ వ్యవహారంపై స్పందిస్తూ.. హాస్పిటల్స్ లో జుట్టు విరబోసుకొని ఏడ్చి నటించాల్సిన అవసరం ఏమీ లేదు. అది కమర్షియల్ సినిమా.. కాబట్టి అంత మేకప్ తో నటించాలని దర్శకుడు చెప్పాడు. కాబట్టి నేను అలా నటించాను.. అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ నటి పేరు మాత్రం నయనతార చెప్పలేదు. కానీ అభిమానులు వెతకగా ఆమె మాళవిక మోహనన్ అని స్పష్టమైనది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.