Nayanatara : పెళ్లయిన తర్వాత జోరు పెంచేసిన నయనతార.. ఏకంగా అలాంటి పని చేస్తూ..! 

Nayanatara : సాధారణంగా ఏ హీరోయిన్ల కైనా సరే సినీ ఇండస్ట్రీలో లైఫ్ స్పామ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాలి. కానీ కొంతమంది విషయంలో ఇది పూర్తిగా విరుద్ధం. అలాంటి వారిలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార కూడా ఒకరు.. ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే దాదాపు 17 సంవత్సరాల కు పైగానే అవుతున్న ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం వివాహమై ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా తల్లి అయిన నయనతార.. వివాహం తర్వాత కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.. ఈ క్రమంలోనే మొన్నటి వరకు సౌత్ ఇండియన్ చిత్రాలకే పరిమితమైన ఈమె నేడు తాజాగా పాన్ ఇండియా సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

Nayanatara after marriage get a chance in pan India movie..!
Nayanatara after marriage get a chance in pan India movie..!

ప్రస్తుతం ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా స్పిరిట్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించబోతోంది అంటూ ఇప్పుడు వార్తలు బాగా జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన కథను డైరెక్టర్ నయనతారకు వినిపించడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈమె ప్రభాస్ తో కలిసి యోగి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభాస్ తో జత కట్టడానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయిన తర్వాత మరింత జోరు పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.