Navdeep – Bindu Madhavi : టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ నటించింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. నవదీప్ ఈ మధ్య సినిమాలు కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన కొత్త వెబ్ సిరీస్ న్యూసెన్స్ టీజర్ విడుదల అయింది. ఈ సిరీస్ ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో తమన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో నవదీప్ బిందు మాధవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. వీళ్ళిద్దరూ కలిసి అల్లరి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఇటీవల విడుదల అయిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ టీజర్ లో నవదీప్ డిఫరెంట్ మ్యానరిజంలో కనిపిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మదనపల్లిలో 2003 ఆ ప్రాంతంలో జరిగిన ఓ కథను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో ఓ రాజకీయ పార్టీ మీటింగ్ జరుగుతున్న సమయంలో నవదీప్ క్యారెక్టర్ ఎంట్రీ చూపించారు. ఆ మీటింగ్ లో రాజకీయ నాయకుడు మాట్లాడుతుండగా నవదీప్ వెనక్కి తిరిగి సైగ చేస్తాడు. ఇంతలో ఓ వ్యక్తి ఆ నాయకుడిపై చెప్పువిసురుతాడు. అప్పుడు సభ అంతా గందరగోళంగా మారుతుంది. ఆ సమయంలో హీరోయిన్ బిందు మాధవి కూడా అక్కడే ఉండి నవదీప్ ను చూస్తుంది. దీంతో టీజర్ ముగుస్తుంది. నవదీప్ ఆ నాయకుడి పై చెప్పు విసిరేలా ఎందుకు చేశారు. ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలాంటింది. అసలు అతను నిజమైన జర్నలిస్టేనా వంటి అంశాలన్నీ తెలియాలంటే సిరీస్ వచ్చే వరకూ ఆగాల్సిందే.
ఇక స్టేజ్ పై నవదీప్ జర్నలిస్టుగా నవ్వులు పూయించాడు. బిందు మాధవి నేను ఇక్కడే ఇంటర్మీడియట్లో చదువుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది అంటూ ఆ టీచర్ లంచ్ ఈవెంట్ కి వచ్చిన ప్రేక్షకులతో మాట్లాడుతుంది. నువ్వు చెప్పిన మాటలు మేము కాంట్రవర్సీగా రాసుకుంటాము అంటూ నవదీప్ బిందు మాధవి ఆటపట్టిస్తాడు. ఇక స్టేజిపై ఉన్న తమను కూడా ఆయన చెప్పిన మాటల్ని కాంట్రవర్సీగా రాస్తాము. ఎందుకంటే మేము జర్నలిస్టుల అడ్డు నవదీప్ ఆట పట్టించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.