Naresh : నరేష్ రమ్య రఘుపతి గొడవలో కొత్త ట్విస్ట్ మొదలైంది.. తనని చంపేందుకు రమ్య రెక్కి నిర్వహించిందని.. ఏ క్షణమైనా తనను చంపచ్చని కోర్టుకు వెళ్లారు. నరేష్ తనని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి తో బెదిరిస్తుందని కూడా సంచలన ఆరోపణలు నరేష్ చేశారు.. 10 కోట్లు ఇస్తే నిన్ను వదిలేస్తానని మధ్యవర్తులతో కలిసి రమ్య బెదిరిస్తుందని మీడియా ముందే చెప్పేశారు నరేష్..
ఇక తన భార్య తాగుతుందని పలు దురా అలవాట్లు ఉన్నాయని కూడా చెప్పారు.. అర్ధరాత్రి సమయంలో లగేజ్ సర్దుకుని ఎవరు పిలిచినా వెళ్ళిపోతుందని ఆధారంగా ఒక ఫోటో కూడా చూపించారు. చిన్నప్పటి నుంచి నా కొడుకుని కూడా తనే కొట్టేదని వాడి కస్టడీని కూడా తనకి ఇచ్చి విడాకులు ఇప్పించామని కోర్టుని ఆశ్రయించారు నరేష్. గత ఏడాది నుంచి ఈ వివాదం ఎలా కొనసాగుతూనే ఉంది. అయితే నటి పవిత్ర తో తను రిలేషన్ లో ఉన్నానని అధికారికంగా ప్రకటించడంతో.. రమ్య రఘుపతి మైసూరులో ప్రెస్ మీట్ పెట్టి మరి సంచల ఆరోపణలు చేసింది.
రమ్య రెక్కీ నిర్వహిస్తుంది కావాలంటే సిసి ఫొటోస్ కూడా చూడండి అంటూ నరేష్ చూపించారు. బెంగళూరుకి చెందిన రాకేష్ శెట్టి అనే కిరాయి రౌడీతో తనని చంపించే ప్రయత్నం కూడా చేస్తుందని.. కృష్ణ గారు చనిపోయినప్పుడు తనమీద రెక్కీ కూడా జరిగిందని.. పలు ఆధారాలు చూపించారు నరేష్ రమ్య వివాదంలోకి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా రావడంతో పోలీసులు ఈ కేసుని హత్యా కోణంలో విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కోర్టు ఏం చెబుతుంది అనేది తెలియాల్సి ఉంది. కానీ రమ్య మాత్రం తను విడాకులు ఇవ్వనంటే మాత్రం ఇవ్వనని చెబుతుంది.
నీకు అక్రమ సంబంధాలు ఎక్కువ నీ గురించి నాకు తెలుసు. నన్ను వేధించి బయటకు పంపావు. సరైన సమయం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని రమ్య కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. విడాకులు మంజూరు కాకుండానే మరో మహిళతో ఎలా కలిసి ఉంటావని నీలతీసింది. నరేష్ చెప్పినవన్నీ నిజాలా.. లేదంటే విడాకులు తీసుకోవడం కోసం తనపై ఆరోపణలు చేశారా అనేది తెలియాల్సి ఉంది. హత్య ఆరోపణలపై రమ్య ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.