Naresh – Pavitra : సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గత కొన్నాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.. ఇక నరేష్ మూడో భార్య రమ్య కూడా వాళ్ళిద్దర్నీ చెన్నైలోని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా మీడియాకు పట్టించింది.. నరేష్ కు నేను విడాకులు ఇవ్వనని ఆమె చెప్పింది.. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లి నరేష్ ని సొంతం చేసుకుంటానని చెప్పింది. కానీ నరేష్ పవిత్ర ఊహించని విధంగా రమ్యను దెబ్బ కొట్టారు..
నరేష్ ట్విట్టర్ వేదికగా నేను వచ్చే ఏడాది పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నానని.. మాకు మీ అందరి ఆశీస్సులు అందజేయమని ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో పవిత్ర నరేష్ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తో పాటు నరేష్ ఆమెకు లిప్ లాక్ కూడా ఇచ్చారు. అయితే జనవరిలో వీళ్ళ పెళ్లి జరుగుతుందని .. అది కూడా అతికొద్ది మంది సన్నిహితుల మధ్యనే జరుగుతుందని సమాచారం. ఇప్పటికే నరేష్ పవిత్ర అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేసిన తరువాతే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారని.. బహుశా సంక్రాంతి తరువాత వీళ్ళ పెళ్లి జరుగుతుందని సమాచారం. రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టించినందుకు నరేష్ ఆమెను చావు దెబ్బ కొట్టినట్టు చేశారు. అయితే నరేష్ పవిత్రను నాలుగో వివాహం చేసుకుంటున్నారు. పవిత్ర కి ఇది రెండో వివాహం. ఈ వివాహ బంధంలో వీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో చూడాలి.