Naresh – Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ పవిత్రా లోకేష్ జంటపై పుకార్ల గురించి తెలిసిందే. కాగా కొత్త ఏడాది రానున్న నేపథ్యంలో నరేష్ పవిత్ర లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ”మళ్లీ పెళ్లి” అనే ప్రకటన #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియో వైరల్ అయ్యింది.. ఇదంతా అంతా నిజం అనుకున్నాం.. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం వేసిన ఎత్తుగడ అని తేలింది..
నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం తాజా ఉదంతాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటూ సాగిస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కు అని తెలిసింది.. ఈరోజుల్లో పుకార్లతో బోలెడంత ఉచిత పబ్లిసిటీ కొట్టేయొచ్చు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. ఏదైనా అనవసర వివాదాన్ని కెలకడం తమ సినిమాకి ప్రచారం చేసుకోవడం నేటి ట్రెండ్. ఇప్పుడు నరేష్ పవిత్ర జంట కూడా అదే ఫార్ములా అప్లై చేసి వాళ్ళ మళ్లీ పెళ్లి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ చేసుకున్నారు..
కొత్త సంవత్సరం రాకముందే అందరిని బకరాలను చేశారు నరేష్ పవిత్ర.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఈ జంటపై మండిపడుతున్నారు.. ఈ సినిమా వారి ఇద్దరికీ సంబంధిచిన బయోపిక్కు అని కూడా ఫిలింనగర్ లో సెటైర్లు వేస్తున్నారు.. మొత్తానికి వీరు వేసిన ఎత్తుగడ ఫలించింది. వీళ్ళ రివర్స్ డ్రామా వర్కౌట్ అయింది. మళ్ళీ పెళ్లి సినిమాకి కావలసినంత పబ్లిసిటీ దక్కింది..