Mahesh Babu : పవిత్ర లోకేష్ – నరేష్ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి.. గతంలో వీరి మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. కాగా పవిత్ర లోకేష్ – నరేష్ ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా నరేష్ ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో నరేష్ పవిత్రను లిప్ కిస్ చేశారు. దాంతో వీళ్లిద్దరూ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యారు. తాజాగా నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నారు.. దాంతో సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి..
కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాటర్ బయటకు రాకుండా చూసుకున్నారు. ఇటీవల నరేష్ మూడో భార్య వీళ్ళని రెండ్ హ్యాండెడ్ గా ఓ హోటల్ లో పట్టిన సంగతి తెలిసిందే. దాంతో నరేష్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం మరోసారి హైలైట్ గా మారింది. కాగా నరేష్ కి వారి ముగ్గురితో విడాకులు అయిపోయాయి. మూడో భార్య రమ్య రఘుపతితో మాత్రం ఇంకా విడాకులు తీసుకోలేదు.
నరేశ్ గెస్ట్ హౌస్ లోనే పవిత్ర తో వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ పోలీస్ కేసుల వరకు కూడా వెళ్లారు. అయితే ఈ వయసులో ఇలా సహజీవనం చేయడంతో వీరిపై విమర్శలు వచ్చాయి. ఇక వీరు వీరిద్దరూ పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ విషయాన్ని మూడు నెలల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు పెండ్లి పీటలు ఎక్కారు. ఇప్పుడు వీరిద్దరి ఫొటోలు చూసిన వారంతా కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఈ వయసులో పెండ్లి ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ జంట పెళ్లి చేసుకున్నారు.