Naresh: సీనియర్ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్య నుంచి తనకి ప్రాణహాని ఉందని కోర్టులో కేసు వేశారు.. తనకు రమ్యతో ప్రాణహాని ఉందని నా ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తుందని.. నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నిస్తుందని.. రమ్య బంధువు అయినా కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించిందని.. తనతో నాకు విడాకులు ఇప్పించాలని కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ వేశారు నరేష్..
నరేష్ మీడియా ముందుకు వచ్చి ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని నరేష్ ఆరోపణలు చేశారు. రమ్య నన్ను చంపడానికి ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ తయారు చేసిందని.. రమ్య మా ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసేవారిలో ఒకరిని బీహార్ నుంచి ఒకరిని పిలిపించిందని.. వారితో తను ఎలాంటి ప్లాన్ వేసిందో కూడా తనకి తెలుసని నరేష్ ఆరోపించారు.
రమ్య టార్గెట్ ఏంటంటే.. ఒకటి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం లేదంటే నన్ను చంపేసి నా ఆస్తిని కాల్ చేయాలని అనుకుంటుంది అని నరేష్ ఆరోపించారు.10 కోట్లు ఇస్తే రమ్య రఘుపతి కాంప్రమైజ్ అవ్వడానికి సిద్దమని ఒక ఫోన్ కాల్ రికార్డ్ చేసిన వాయిస్ వినిపించారు.
నేను చచ్చిపోతే పోలీసులకు నా భార్య కంప్లైంట్ ఇవ్వాలి. తను కంప్లైంట్ ఇవ్వకపోతే.. తనకు వందల కోట్ల ఆస్తి వస్తుంది. ఇది తన ప్లాన్ అంటూ నరేష్ మీడియా ముందుకు వచ్చి సాక్షదారాలతో సహా రమ్య చేసిన కుట్రల బయట పెట్టాడు నరేష్. ఇక ఇవన్నీ కోర్టుకి సమర్పిస్తే రమ్యకు జైలు శిక్ష పడటం గ్యారెంటీ అని పేరున్న న్యాయవాదులు చెబుతున్నారు. ఇక ఈ విషయంలో రమ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.