Pranathi Brahmini: ఒకవైపు ఈ కార్ రేసింగ్.. మరోవైపు స్టార్ సెలబ్రిటీల సందడి.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సిన అసలైన పండుగ.. ఓకే ఫ్రేమ్ లో స్టార్ సెలబ్రెటీలు కనిపిస్తే ఆ ఆనందమే వేరు వాస్తవానికి ఒకే కుటుంబానికి చెందిన వారైనా.. నారా కోడలు బ్రాహ్మణి నందమూరి కోడలు లక్ష్మీ ప్రణీత ఓకే టైంలో కనిపించడం అరుదు.. రాజాగా వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రయ్ రయ్ మంటూ కార్లు దూసుకెల్లడం ఒక ఎత్తు అయితే.. నువ్వా నేనా అంటూ రేసర్లు పోటీ పడుతుండడం మరో ఎత్తు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తూ క్షణాల్లో కళ్ళముందే మాయ మవుతుంటాయి..
ఈ రేసును ప్రత్యక్షంగా చూడటానికి నారా బ్రాహ్మణి లక్ష్మీప్రణతి విచ్చేశారు. నారా బ్రాహ్మణి కొడుకు దేవాన్ష్ తో కలిసి హాజరుగాక లక్ష్మీ ప్రణతి ఒంటరిగానే వచ్చారు ఇద్దరు ఒకే చోట కనిపించారు.. ఒకవైపు సెలబ్రెటీలు కళ్ళ ముందు కనిపించడంతో అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.. మరి కొంతమంది స్టార్స్ సెలబ్రిటీలు కూడా అక్కడికి విచ్చేశారు..
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్.. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు రేసింగ్ చూస్తూ సందడి చేశారు. ప్రధాన రేస్ శనివారం ఈరోజు జరగనుంది. నిన్న ప్రీ ప్రాక్టీస్ వన్ రేస్ను నిర్వహించారు. మొత్తం 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ఫ్రీ డేస్ లో పాల్గొన్నారు. ట్రాక్ ఎలా స్పందిస్తుంది కార్లను ఎలా అదుపు చేయాలి.. ఎక్కడ వేగం పెంచాలి వంటి విషయాలపై రేసర్లు కు అవగాహన రావడానికి ఈ ఫ్రీ రేసును నిర్వహించారు. ఈ రేసింగ్ చూడడానికి నేడు మరి కొంత మంది స్టార్ సెలబ్రిటీలు రానున్నారు.