Nani Dussehra Movie : నాని దసరా సినిమా కళ్ళు చెదిరే దియేట్రికల్ బిజినెస్..!!

Nani Dussehra Movie : నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా అంటే సుందరానికి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో వచ్చి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ప్లాప్ టాక్ దక్కించుకుంది.. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నారు ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!! గత ఏడాది నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి సాధించింది.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదనిపించింది. ఈ సినిమాకి ముందు నాని నటించిన వీ(V) , టక్ జగదీష్ రెండు సినిమాలు ఓటీటి వేదికగా విడుదలై పరవాలేదు అనిపించాయి.

ప్రస్తుతం నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు తో ‘దసరా’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ తో పాటు టీజర్ కి మంచి అంచనాలే ఉన్నాయి.. దీంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో వస్తాయి.. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ తో కేక పెట్టిస్తుందని ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది. నాని కెరీర్ లోనే మొదటిసారిగా భారీ స్థాయిలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం..

Nani Dussehra Movie huge non theatrical business
Nani Dussehra Movie huge non theatrical business

ఈ సినిమా 2023 మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో నాని ఓ పల్లెటూరి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. నాని లేటెస్ట్ గా నటిస్తున్న దసరా సినిమా 45 కోట్లు నాన్ దియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.. ఈ సినిమా నాన్ ధియేటర్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడుపోయాయని టాక్.. నాని కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని విశ్లేషకులు అంటున్నారు. దసరా సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చేకూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా ధియేటర్స్ లో సందడి చేయనుంది..

Advertisement