Nandamuri Mokshagna : మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఆ డైరెక్టర్ తో ఫిక్స్..!

Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. మోక్షజ్ఞ ఎప్పుడు సినీ తెరంగేట్రం చేస్తాడా అని నందమూరి అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా లీకైనా ఫొటోస్ చూస్తుంటే.. మోక్షజ్ఞ పెద్దగా ఇండస్ట్రీ లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.. ఎందుకంటే బాడీ అంత ఫిట్నెస్ గా ఉన్నట్లు లేదు. నిజానికి మోక్షజ్ఞకు సినీ ఎంట్రీ పై ఇంట్రెస్ట్ లేదా లేకపోతే తండ్రి ఇప్పుడే ఎందుకులే అని ఆపుతున్నారా.. అనే సందేహాలు ఉన్నప్పటికీ ఎవ్వరూ కూడా అడగడానికి సాహసించలేదు.

మోక్షజ్ఞను కొన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సాయి కొర్రపాటి దర్శకత్వంలో మా రామయ్య రానే వచ్చాడు అనే టైటిల్ తో మూవీ ప్లాన్ చేయాలని అనుకున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. కానీ ఊహించిన స్థాయిలో సినిమా ఆడలేదు. దీంతో టైటిల్ మారుద్దామని ఆలోచన కూడా చేసినప్పటికీ ఆ సినిమాకు బ్రేక్ పడింది. మోక్షజ్ఞ ఇంట్రెస్ట్ లేకుండానే ఎవరో బలవంతంతో ఇండస్ట్రీ లోకి తీసుకు వస్తున్నట్లు కొన్ని పుకార్లు షికార్లు చేసినప్పటికీ అవి ఎంతవరకు నిజం అనేది తెలియలేదు.

Nandamuri Mokshagna tollywood entry update
Nandamuri Mokshagna tollywood entry update

మోక్షజ్ఞ ఎంట్రీ పై కొన్ని నెలల క్రితం పూరి జగన్నాథ్ పేరు ఇచ్చినట్లు సమాచారం. అయితే లైగర్ డిజాస్టర్ తర్వాత పెద్దగా ఆలోచన చేయలేదు. పైసా వసూల్ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ తో మరొక సినిమా చేస్తానని కమిట్మెంట్ తో ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీని పూరి జగన్నాథ్ తో చేస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు.. ఏమవుతుంది అనేది చూడాలి..

Advertisement