Mahesh Babu : నమ్రత మహేష్ కోసం చేసే పూజలపై దారుణమైన విమర్శలు.. వాస్తవాలు ఇవి..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, సినీ నటి, నిర్మాత నమ్రత శిరోద్కర్ ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. పద్మావతి, అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి గోశాలను కూడా సందర్శించారు. దేవాలయ కమిటీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పురోహితులు అర్చన నిర్వహించి నమ్రత శిరోద్కర్‌కు ఆశీర్వాదం అందించారు. కాగా నమ్రత చేసిన పూజలపై రకరకాల విమర్శలు వెలువతాయి..

Mahesh Babu wife namrata emotional post on her dad
Mahesh Babu wife namrata emotional post on her dad

సాధారణంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్యన ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంటుంది మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ అయ్యారు అల్లు అర్జున్ హీరోగా మొదలుపెట్టి అతికొద్ది కాలంలోనే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. మహేష్ బాబు కంటే వెనక్కి వచ్చిన అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అందుకోసమే మహేష్ కోసం నమ్రతా ప్రత్యేక పూజలు చేయించిందని ఈ పూజలపై ఓ కట్టుకథలు అల్లారు సోషల్ మీడియా గాసిప్ రాయుళ్లు.

వట్టెం గ్రామంలోని వేంకటేశ్వర ఆలయం తెలంగాణ చిన తిరుపతిగా పేరు పొందింది. ఈ ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంటే నమ్రత మహేష్ కోసం పూజలు చేయటంపై మరొక వార్త కూడా వచ్చింది అదేంటంటే సూపర్ స్టార్ కృష్ణ చనిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు. అలాంటప్పుడు నమ్రత ఏ విధంగా పూజలు చేస్తుందని మరి కొంతమంది ప్రశ్నించారు.

సీని సెలబ్రిటీస్ కావడంతో వీరు ఏ చిన్న పని చేసినా దానిని భూతద్దంలో పెట్టి వెతుకు చూస్తున్నారే తప్ప.. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలుగుతుందనే ఆలోచన మాత్రం ఇలాంటి వార్తలు రాసేవారికి కలగడం లేదని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా స్టార్ సెలబ్రిటీ.. మహేష్ నమ్రత గురించి మాట్లాడారు. వారి వ్యక్తిగత జీవితం బాగుంటుంది. వాళ్లు ఏ హోదా కోసం స్టార్ స్టేటస్ కోసము వెంట పడరని వారు బిజినెస్ రంగంలో ఉన్నా కూడా సినిమానే ప్రపంచంగా బతుకుతున్నారని ..ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారికి ఇబ్బంది కలగకుండా చేస్తే మంచిదని అన్నారు. పూజలు ఒకరి మంచి కోసమా దేనికోసమా అనేది వారి వ్యక్తిగత విషయమని కనీసం దేవుడిని పూజ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ కి మహేష్ బాబు కి ఇలాంటి గొడవలు ఏమీ ఉండవని వారిద్దరూ ఎంతో సన్నిహిత్యంగా ఉంటారు అని చెప్పుకొచ్చారు.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి