టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో మహేష్ నమ్రత ఒకరు.. నమ్రత బాలీవుడ్ నుంచి తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.. ఇక వంశీ సినిమా షూటింగ్ లో ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సితార గురించి సంచలన విషయాలు చెప్పిన నమ్రత.. ఇప్పుడు మహేష్ బాబు తో పెళ్లికి ముందే ఆ విషయంలో డీల్ కుదుర్చుకున్నానని.. ఆ డీల్ కు మహేష్ ఒప్పుకోవడం వల్లే పెళ్లి చేసుకున్నాను అని చెప్పినా మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ బాబుతో నమ్రత మధ్య జరిగిన డీల్ ఏంటంటే.. పెళ్లి తర్వాత మహేష్ నన్ను హౌస్ వైఫ్ గా ఉండాలని అడిగారు.. అందుకు ఒప్పుకోవడానికి నేను మహేష్ కి ఒక కండిషన్ పెట్టాను. అది ఏంటంటే నేను ఓ పెద్ద బంగ్లాలో ఉండనని.. ఇద్దరూ వేరే వేరే ఇల్లు తీసుకొని ఉండాలని చెప్పాను. ఎందుకంటే నాకు పెద్ద బంగ్లాలో నివసించడం అంటే చాలా భయం. ఆ షరతుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అని చెప్పానని.. ఈ డీల్ కు మహేష్ ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నానని నమ్రత మీడియాతో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ నమ్రత ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే.