Nagarjuna : నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం అమలా కాదా.. ఇదేం ట్విస్ట్ రా బాబూ..

Nagarjuna :  అక్కినేని నాగేశ్వరరావు , దగ్గుబాటి రామానాయుడు మధ్య సన్నిహిత బంధం ఏర్పడడంతో ఇద్దరు కూడా వియ్యంకులు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటికే విక్రమ్ సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జునకు.. చిన్నప్పటినుంచి అమెరికాలోనే సెటిల్ అయినా దగ్గుబాటి లక్ష్మీని ఇచ్చి వివాహం జరిపించారు రామానాయుడు. వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలకి వీరిద్దరికీ నాగచైతన్య కూడా జన్మించారు. ఇక అంతా బాగుంది అనుకునే లోపే దగ్గుబాటి లక్ష్మి నాగార్జునతో అమెరికాలో సెటిల్ అవుదామని అక్కడే ఉందామని కోరిందట.

Advertisement
nagarjunas-reason-for-divorcing-to-his-first-wife-is-amala-or-not
nagarjunas-reason-for-divorcing-to-his-first-wife-is-amala-or-not

అయితే నాగార్జునకు సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో.. అమెరికా వెళ్లడానికి ఇష్టపడలేదు .దాంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు రావడంతో అది కాస్త విడాకుల వరకు వెళ్లాయి . దాంతో విడాకులు తీసుకున్న నాగార్జున ఆ తర్వాత కొద్ది రోజులకు తనతో కలిసి నటించిన అమలను వివాహం చేసుకోగా వీరికి అక్కినేని అఖిల్ జన్మించారు. దగ్గుబాటి లక్ష్మి విడాకులు తీసుకొని అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు కూడా ఒక్క కొడుకు జన్మించారు. అక్కినేని నాగార్జున అటుతల్లితో ఇటు తండ్రితో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రస్తుతం తండ్రి తోనే ఉంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం సినిమాలు అని .. అమలా కాదు అని స్పష్టమవుతుంది.

Advertisement
Advertisement