Nagarjuna : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో సీజన్ 6 జరుపుకుంటుంది. 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్లోకి అడుగుపెట్టగా,వారానికి ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. చివరిగా చంటి కూడా హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ షో పెద్దగా వినోదం పంచలేని కారణంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. అయితే అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా, ఉంటే ఎలాంటి గెస్ట్ని హౌజ్లోకి తీసుకొస్తారు ఇలాంటి సందేహాలు ఎన్నో అందరి మదిలో మెదులుతున్నాయి.
అయితే నాగార్జున చుట్టాన్ని బిగ్ బాస్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారనే ఒక టాక్ కూడా ఉంది. తెలుగు బిగ్ బాస్ షో గత సీజన్స్ అన్నిటికంటే కూడా ఈసారి చాలా నిరాశపరిచే విధంగా ఉంది. అసలు కంటెస్టెంట్స్ విషయంలోనే చాలామంది నిరాశకు గురయ్యారు. కొంత పేరు ఉన్న సెలబ్రిటీలను తీసుకురాకుండా ఎవరెవరో కొత్తవారిని తీసుకు రావడంతో షో నీరసంగా సాగుతుంది ఈసారి బిగ్ బాస్ నిలదొక్కుకోవడం కూడా కష్టమే అని మధ్యలోనే ఆగిపోతుంది అని కొందరు ప్రచారాలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిని తిప్పి కొట్టేలా నాగార్జునతో పాటు నిర్వాహకులు సరికొత్త స్కెచ్లు వేస్తున్నారట.
ఈ క్రమంలోనే తన చుట్టాన్ని బిగ్ బాస్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా పంపించాలని అప్పుడు షో మరింత రంజుగా సాగుతుందని సలహా ఇచ్చారట. ఇప్పుడు నాగార్జున చుట్టం ఎవరు, వారికి బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చే అవసరం ఏమోచ్చింది అని కొందరు చర్చలు జరుపుతున్నారు. నాగార్జున ఫ్యామిలీ నుండి సుశాంత్, సుమంత్, అఖిల్, నాగ చైతన్యలు హీరోలుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అఖిల్, నాగ చైతన్య ఏదో అలా నెట్టుకొస్తుండగా, సుమంత్, సుశాంత్ పరిస్థితి దారుణంగా ఉంది. వీరి క్రేజ్ పెంచేందుకు బిగ్ బాస్ హౌజ్లోకి వారిలో ఒకరిని పంపబోతున్నారా అంటూ మరి కొందరు ముచ్చటించుకున్నారు. రానున్నరోజులలో వీటిపై క్లారిటీ రానుంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.