Nagarjuna : “బిగ్ బాస్ లోంచి గెంటేస్తారా”.. నాగార్జున కూడా ఉలిక్కిపడేలా షాక్‌ నిర్ణయం..!

Nagarjuna : బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత బాగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. పైగా అత్యధిక టిఆర్పి రేటింగ్ కలిగిన షో గా కూడా పాపులర్ అయింది.. ఈ షో కి నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం ఆరో సీజన్ విజయవంతంగా సాగుతోంది.. మొదటి వారంలో ఎలిమినేషన్ లేదు కానీ.. సెకండ్ వీక్ లో మాత్రం హౌస్ నుండి ఇద్దరూ ఎలిమినేట్ అవుతారని నాగార్జున ముందుగానే చెప్పారు.. మొదటివారం నాగార్జున కాంటెస్టెంట్స్ తో కూల్ గా ఆటలాడించారు.. కానీ రెండవ వారం కాంటెస్టెంట్స్ పై మాత్రం ఫైర్ బ్రాండ్ లా ఫైర్ అయ్యారు..! నిన్న హౌస్ నుండి షాని సోలమన్ మొదటి కాంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి బయటకు పంపారు..!

హాలులో కూర్చున్న 20 మంది కంటెస్టెంట్స్ లో బాలాదిత్య, వాసంతి, సుదీప, షాని, శ్రీ సత్య, అభినయ, శ్రీహస్, కీర్తి, రోహిత్ అండ్ మరీనాలను సోఫా బయట నాగార్జున నిల్చమని చెప్పారు.. ఆ తరువాత సోఫాలో కూర్చున్న 11 మంది కాంటెస్టెంట్స్ లా ఆట తీరని వివరిస్తూ నాగార్జున క్లాస్ పీకారు.. వాళ్ల ఆట తీరు గురించి మాట్లాడిన తర్వాత ఆ 11 మందిని వెనకమాల నుంచున్న తొమ్మిది మంది కాంటెస్టెంట్స్ లలో ఎవరు వేస్ట్ అనేది ఓటింగ్ ద్వారా చెప్పమని నాగార్జున రిక్వెస్ట్ చేశారు.. వాళ్లలో శ్రీ సత్య, వాసంతి, షాని లకు మూడు మూడు ఓట్లు పడ్డాయి.. ఇక ఇంటి సభ్యుల ఓటింగ్ ఆడియన్స్ ఓటింగ్లతో మ్యాచ్ అయిందని.. షాని నీ ఎలిమినేట్ చేశారు.. అయితే అతన్ని గత సీజన్లో మాదిరిగా కాకుండా సాదాసీదాగా బయటకు పంపించారు..

Nagarjuna also decided to Bigg Boss
Nagarjuna also decided to Bigg Boss

కనీసం బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ ఎలా ఉంది అనేది చూపించలేదు.. షానికి ఒక టాస్క్ కూడా ఇవ్వలేదు నాగర్జున.. కనీసం బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవం గురించి ఒక్క అభిప్రాయం కూడా పంచుకొని ఇవ్వలేదు.. షాని సోలమన్ ను చాలా సింపుల్ గా హౌస్ నుంచి బయటకు పంపించేశారు నాగార్జున.. షాని సోలమన్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత తనని ఇంటర్వ్యూ చేయడానికి పలు మీడియా ఛానల్స్ పోటీ పడుతున్నాయి.. అయితే షాని సోలమన్ తనని బిగ్ బాస్ షో నుంచి కావాలని గెంటేసారని.. ప్రెస్ మీట్ పెట్టాలని షాని అనుకుట్టున్నటు.. అందులో హౌస్ కి సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టనున్నడని ఒక పుకారు షికారు చేస్తోంది.. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలి..

Advertisement