Samantha : నాగ చైతన్యతో వేరే అమ్మాయి.. ఈమె తోనే రెండో పెళ్లి ?? తన వాట్సాప్ లో వాళ్ళిద్దరి ఫోటో చూసి ఒకే ఒక్క మాట అన్న సమంత !

Samantha :  టాలీవుడ్ క్యూట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగచైతన్య ఏం మాయ చేసావే సినిమాతోనే ప్రేమలో పడ్డారు.. కొంతకాలానికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే సమంత మరెవరితోనో కలిసి ఉండని అందుకే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరగగా.. సదరు వ్యక్తి నేను సమంతను అక్క అని పిలుస్తానని.. మా ఇద్దరి మధ్య ఎలాంటి అలాంటిది ఏమీ లేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగిన కొద్ది రోజులకే శోభిత ధూళిపాలతో నాగచైతన్య ప్రేమలో పడ్డాడని త్వరలో పెళ్లికూడా చేసుకుని అవకాశం ఉందని విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Advertisement
Nagachaithaya shobitha dhullipala dating issue Samantha reaction
Nagachaithaya shobitha dhullipala dating issue Samantha reaction

నాగచైతన్య శోభిత ధూళిపాల డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య శోభిత పక్కనే నిల్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ పక్కపక్కనే ఉన్న ఫోటోలను కట్ చేసి పెట్టినట్లుగా మరో ట్వీట్ వైరల్ అవుతుంది. త్వరలోనే అఫీషియల్ చేసేలాగా ఉన్నారు అని ఓ యూజర్ రాసుకోస్తే.. మరొక యూజర్ మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. శోభిత అక్కినేని అక్కర్లేని ఫ్యాన్స్ అర్హులు. సమంత డ్రెస్సింగ్ గురించి వాగిన ప్రతి కుక్కకి కొత్త వదిన మంచి స్టఫ్ ఇస్తది. ఈమె నాగచైతన్యకి బెస్ట్ చాయిస్.. కనీసం ఈమెను అయినా మోసం చేయకపోతే చాలు. ఈ అమ్మాయి కూడా బాధపడటం నాకు ఇష్టం లేదు అని రాసుకొచ్చారు.

Advertisement

నాగచైతన్య శోభిత కలిసి ఉన్న ఫోటోను తన వాట్సాప్ లో చూసిన సమంత.. వీళ్ళిద్దరి మీద నాకు ఎప్పటినుంచో డౌట్ ఉంది అని తన సన్నిహితులతో చెప్పిందట సమంత. దీన్ని బట్టి చూస్తే సమంతకు ముందు నుంచి ఈ విషయం తెలుసు అన్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకే నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్య శోభిత డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement