Naga Chaitanya : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ చిత్రం ఉగ్రం నరేష్ తో నాంది చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కనకమెడల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది .. ఏఎంబి సినిమాస్ లో ఉగ్రం టీజర్ ను ఈరోజు అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు.. నాగచైతన్య లుక్స్ మాత్రం ఈ సినిమా హీరోయిన్ మీర్ణా పై ఉన్నాయి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
ఉగ్రం అనగానే కథానాయకుడు ఎందుకు అంత ఉగ్రంగా తయారయ్యాడు అన్న దానిమీద ఈ కథ నడిచినట్టుగా కనపడుతోంది హీరో కుటుంబ సభ్యులు తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులను వెంటాడి వేటాడే పోలీస్ ఆఫీసర్గా నరేష్ హస్త వైవిధ్యంగా ఇందులో కనిపించనున్నారు. ఈ టీజర్ కి తోడు శ్రీ చరణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ పై మరింత ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మలయాళ బ్యూటి మీర్ణా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగచైతన్య అందరితో పాటుగా మీర్ణా కూడా ఈ సినిమా హిట్ అవుతుందంటూ విష్ చేశారు దాంతో నాగచైతన్య చూపులన్నీ ఈ హీరోయిన్ పైనే ఉన్నాయంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
ఉగ్రం చిత్రాన్ని టూం వెంకట్ అబ్బూరి రవి కథ, సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారి పాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఉగ్రం సినిమాకి శ్రీ చరణ్ పానకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మే 5న థియేటర్స్ లో విడుదల కానుంది.