Samantha – Naga Chaitanya : 2022 కి గుడ్ బై చెప్పేసి 2023లోకి అడుగుపెట్టేసాం.. కొత్త సంవత్సరం ఎన్నో కలలతో, ఆశలతో, ఏదో సాధించాలని అందరం ప్రణాళికలు వేసుకున్నాం.. ఇక కొత్త సంవత్సరాన్ని అందరూ వేడుకగా జరుపుకుంటున్నారు.. స్టార్ నటీనటులంతా వారి అభిమానులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడంలో మునిగి తేలుతున్నారు. నాగచైతన్య మాత్రం ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదట.. అందుకు ఓ బలమైన కారణం కూడా ఉంది..
అక్కినేని ఫ్యామిలీ సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు అని అనుకున్నారట.. నాగచైతన్య తన కారణంగానే సమంత ఆరోగ్య పరిస్థితి ఈ స్టేజ్ కి వచ్చిందని .. మానసిక సమస్యలను కొని తెచ్చుకుందని.. ఇంట్లో అందరూ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒప్పుకున్న కూడా నాగచైతన్య మాత్రం ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకొను గాక చేసుకోనని ఫైనల్ గా చెప్పేశాడట.. సమంత ఆరోగ్యం కుదుటపడటం లేదని.. తను నా గురించి ఆలోచించి.. నా వల్లే డిప్రెషన్ లోకి వెళ్లిందని.. తను కోల్కొని నార్మల్ స్థితికి వచ్చేవరకు నేను ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోనని నాగచైతన్య ఇంట్లో అందరికీ తెగేసి చెప్పేశాడట.. సమంత తన కోసం చేసిన త్యాగాలతో పోలిస్తే ఇది ఏమి పెద్దది కాదని.. ముందు తను కోల్కోవడమే నాకు ముఖ్యమని.. తను ఆరోగ్యంగా ఉంటే నాకు అదే చాలని నాగచైతన్య అన్నారట.