Naga Babu : మెగా ఫ్యామిలీ నుండి సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక ముద్దుగుమ్మ నిహారిక. మెగా కాంపౌండ్ లో చాలామంది హీరోలుగా పరిచయమయ్యారు. కానీ మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక్కరే తెగించి హీరోయిన్ గా రావటం జరిగింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. అయినా గాని సినిమా రంగాన్ని విడవకుండా నిర్మాతగా షార్ట్ ఫిలిమ్స్… వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ రాణిస్తోంది. వైవిద్య భరితమైన సబ్జెక్టులతో నిర్మాతగా కొత్తవారికి అవకాశం కల్పించే రీతిలో నిహారిక తన వంతు కృషి చేస్తూ ఉంది. ఈ రీతిగా రాణిస్తూ ఉండగా 2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో చైతన్య కృష్ణ జొన్నలగడ్డతో వివాహం జరిగింది. ఆ ఏడాది డిసెంబర్ నెలలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయగిరి ప్యాలెస్ లో… అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు అందరూ వచ్చారు.
అయితే పెళ్లి జరిగి ఏడాది కాగా అప్పుడే వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. పెళ్లయిన ప్రారంభంలోనే.. నిహారిక.. చైతన్య కృష్ణ మధ్య గొడవ జరిగినట్లు ప్రచారమైతే అప్పుడు భర్త చైతన్య కృష్ణ వీడియో రూపంలో అవన్నీ ఆవాస్తవాలనీ క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా మాత్రం గత కొద్ది నెలల నుండి విడాకుల వార్తలు వస్తున్నా కానీ అటు నిహారిక ఇటు చైతన్య కృష్ణ ఎవరు స్పందించడం లేదు. పైగా చైతన్య కృష్ణ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లోనే నీహారిక ఫోటోలు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం… తనకి మామిడికాయ తినాలని ఉందని.. నిహారిక ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.
ఈ పోస్ట్ పట్ల చాలామంది వెరైటీగా స్పందించారు. ఏదైనా విశేషం ఉందా అంటూ.. తెగ కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఇదే విషయంపై నాగబాబు త్వరలో సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా సమావేశం పెట్టి… విడాకుల గురించి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు మెగా కాంపౌండ్ నుండి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికలకు పార్టీని అన్ని రకాలుగా… సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ మంచి రోజు చూసుకుని.. నిహారిక కి సంబంధించి.. ఓ మంచి విశేషం నాగబాబు ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.