Samantha : విడాకులు తీసుకున్నా సరే.. సమంత కోసం ‘ఇంకా కంటిన్యూ’ చేస్తున్న నాగ చైతన్య.!

Samantha : నాగ చైతన్య, సమంత ఏ మాయ చేసావే సినిమాతో తెలివితరకు పరిచయం అయ్యారు.. మొదటి చిత్రంతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది.. పెద్దల సమక్షంలో సమంత నాగ చైతన్య మూడు ముళ్ల బంధం తో ఒకటయ్యారు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని వన్ అఫ్ ది క్యూటెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు.. ఇక పెళ్లి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరి లాగానే ఉండాలి అనేంత ఎఫెక్షన్ గా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా వీళ్ళు దిగిన ఫోటోలు అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.. పెళ్లి నాలుగో సంవత్సరం పూర్తి కాకముందే విడిపోతున్నాము అంటూ అందరి ముందు కుండ బద్దలు కొట్టారు..!

Advertisement

అంత ప్రేమగా ఉన్న వీళ్ళిద్దరూ అసలు ఎందుకు ఓడిపోయారు అనేది ఎప్పటికీ మిస్టరీగానే ఉంది..! కానీ వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు ఇప్పటికీ తెలియక సోషల్ మీడియాలో ఉన్నవి లేనిపోనివి మాత్రం వైరల్ గా మారుతున్నాయి.. అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంతా నాగ చైతన్య పైన ఎన్నో అనుమనాలకు తెర తీసింది.. నాగచైతన్య సమంత విడిపోయిన తరువాత నాగచైతన్య సమంతను ఒక్క మాట కూడా అనలేదు.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విడాకులు తీసుకున్న ఇద్దరం హ్యాపీగా ఉన్నాం.. తను హ్యాపీ.. నేను హ్యాపీ.. అంటూ కామెంట్ చేశారు.. అంతే కానీ సమంత లాగా ఎప్పుడు మాట్లాడలేదు..

Advertisement
Naga Chaitanya who still continuing for Samantha
Naga Chaitanya who still continuing for Samantha

అయితే నాగచైతన్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత కోసం తనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడని తెలుస్తోంది.. సమంతకి గ్రీన్ నేచర్ అంటే చాలా ఇష్టం.. సమంతకు చెట్లంటే ఎంత ఇష్టమో మనందరికీ కూడా తెలుసు.. నాగచైతన్య సమంత ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కాస్త సమయం దొరికితే ఇద్దరూ కలిసి ఇంకా గార్డెనింగ్ చేసేవారట.. అయితే నాగచైతన్య అదే అలవాటును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడట. సమంత నాగ చైతన్య పక్కన లేకపోయినా కానీ తన జ్ఞాపకాలతో తనని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాడని తెలుస్తుంది.. ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు మళ్లీ మీరిద్దరూ కలిస్తే చూడాలని వుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు..

Advertisement