ఆ దర్శకుడిగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది: నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ.’ దీనిని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా సినిమా ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే తాజాగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన ‘కస్టడీ’ మూవీతోపాటు దర్శకుడు పరశురామ్ తో తలెత్తిన వివాదంపై స్పందించడం ఇపుడు టాలీవుడ్ అంతటా హాట్ టాపిక్ అయింది.

ఇకపోతే కస్టడీ గురించి నాగ చైతన్య మాట్లాడుతూ… “వెంకట్ ప్రభు ‘కస్టడీ’ కథ చెప్పిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పైన ఎంతో ఆసక్తి కలిగింది. దాంతో ఈ కథను నేను తప్పకుండా చేస్తానని మాటిచ్చాను. ఇందులో నేను పోలీస్ కానిస్టేబుల్ పాత్రని పోషించాను. తెలుగు, తమిళంలో ఒకేసారి దీన్ని తెరకెక్కించడం జరిగింది. ఏ సినిమాలో అన్నా ఒక హీరో, విలన్ ని చంపాలని అనుకుంటాడు. కానీ, ఈ కధలో హీరో విలన్ ని ప్రాణాలతో కాపాడాలని అనుకుంటాడు. ఎందుకంటే అతడు హీరో కస్టడీలో ఉంటాడు కాబట్టి. కాగా ఈ కథకు ‘కస్టడీ’ పేరు సరిగ్గా నప్పుతుంది” అని చై చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే చైతన్య పరశురామ్ విషయంలో తలెత్తిన సమస్యలపై విలేకరి అడగగా ఒక్కమాటలో “ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. ఆయన నా టైమ్ చాలా వేస్ట్ చేశారు. ఆ విషయం గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ.” అని అన్నారు. అయితే అప్పటినుండి ఈ విషయంపైన సోషల్ మీడియాలో పలు కధనాలు వస్తూనే వున్నాయి. అయితే ఈ విషయంపైన ఎలాంటి వివాదం అవసరంలేదని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఆ తరువాత చై తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై మాట్లాడుతూ… ‘మజిలీ’ దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ పరశురామ్ గొడవ ఏమిటంటే.. ‘గీతగోవిందం’ సక్సెస్ తర్వాత పరశురామ్.. నాగచైతన్యతో ‘నాగేశ్వరరావు’ అనే సినిమా చేయాలని ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్ పలుదఫాలు వాయిదాపడింది. ఓ మంచి రోజున ఇది పట్టాలెక్కుతుందని అక్కినేని అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూశారు. అయితే, అనుకోని కారణాల వలన ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయింది.

Advertisement
Advertisement