AR Rahman : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్నో ఇండియన్ సినిమాలకు సంగీతాన్ని అందించి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సంగీతంతోనే కాదు సినిమాలు కూడా చేసి మరింత పాపులారిటీ ని దక్కించుకున్న ఈయన తాజాగా పొన్నియన్ సెల్వన్ -1 సినిమాకి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కీలకపాత్ర పోషించింది.

అటు తెలుగు , ఇటు తమిళ్, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా భారీ చిత్రాలకు పని చేస్తూ.. బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ బట్టి పారితోషకాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకి రూ.6 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ రెమ్యునరేషన్ పెంచుతూ ఇప్పుడు రూ.8 కోట్లకు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఏ ఆర్ రెహమాన్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయాలంటే రూ.8కోట్లు ఇవ్వాల్సిందే అనే డిమాండ్ కూడా మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అధికారికంగా వెలువడాల్సిందే.