Mrunal Thakur : పాపం సీతారామం హీరోయిన్ మృణాల్ ని దారుణంగా ఏడిపిస్తున్నారు !

Mrunal Thakur: సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక సెల‌బ్రిటీల‌కు కంటిపై కునుకు లేకుండా పోయింది. ఏదో ఒక విష‌యం వెతికి స్టార్స్‌ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ట్రోలింగ్‌కి గుర‌వుతుంది. సీతారామం చిత్రంలో త‌న అందం, అభిన‌యంతో అల‌రించిన మృణాల్ ఠాకూర్ .. ‘కుంకుమ భాగ్య’ అనే హిందీ సిరియల్‌తో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌కి చెల్లిగా ఆమె నటించింది. ఈ సీరియల్‌కు తెలుగులో సైతం మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలో ‘సూపర్‌ 30’, జర్సీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్‌గా మారింది మృణాల్‌.

సీతారామం సినిమా తనకు ఎప్పటికీ సంతోషాన్ని కలిగిస్తోందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అంటోంది. తాను ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా, సీతా రామం మూవీ ట్రెండింగ్‌లో కనిపిస్తుండటం.. తన సంతోషాన్ని రెట్టింపు చేస్తోందని, తనకు సీత పాత్రను ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ ఈ బ్యూటీ ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మృణాల్‌కి సంబంధించిన ఓ పిక్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇందులో మృణాల్ గుర్తుప‌ట్టలేని విధంగా ఉంది. ఆమె ముఖం, చేతులు కమలిపోయినట్లు కనిపించాయి. సీతారామంలో అంత అందంగా క‌నిపించిన మృణాల్ ఇప్పుడు ఇలా ఉందేంటి.. అసలు మృనాల్ కు ఏమైంది? ఇది ఎప్పటి ఫోటో?

mrunal thakur surprising look viral
mrunal thakur surprising look viral

Mrunal Thakur : ముఖానికి ఏమైంది?

ఏదైనా సినిమా కోసం ఆమెను అలా తయారు చేశారా? లేక ఇంకేదైనా జరిగిందా? అంటూ ఆ ఫోటోపై నేటిజన్లు ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. అయితే ఇది ఓల్డ్ పిక్ అని, ఏదో సీరియల్ లోని పాత్ర కోసం ఆమె అలా డిగ్లామర్ లుక్ లో మేకవర్ అయిందని అంటున్నారు. ఇక ఇటీవ‌ల మృణాల్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చింది. నన్ను అర్ధం చేసుకొనే వాడిని మాత్ర‌మే నేను పెళ్లి చేసుకుంటాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయి.. అలాంటి లైఫ్‌ను అర్ధం చేసుకొనివాడినే నేను వివాహం చేసుకుంటానని పేర్కొంది. ఇక పిల్ల‌ల గురించి మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే.. నాకు పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉంది. ఎందుకో నాకు ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదంటూ పేర్కోంది. ఆమె వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Advertisement