Taraka Ratna : నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించారు. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, టిడిపి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న మరణం ఆయన భార్య అలేఖ్య రెడ్డిని తీవ్రంగా కలిసి వేసింది.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి 39 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడటాన్ని అలేఖ్య రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఆమె అస్వస్థకు గురై ఆసుపత్రిపాలైనట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయం పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆమె పెద్దనాన్న విజయ్ సాయి రెడ్డి ప్రస్తుత పరిస్థితి, తారకరత్న అంత్యక్రియల విషయమై మీడియాతో తెలిపారు. తారకరత్న ఎంతో మంచి వ్యక్తిని.. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వారిని.. అందరిని వరుసలతో పిలిచేవారని.. ఆయన రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్న సమయంలో అనంత లోకాలకు చేరుకోవడం దురదుష్టకరమని అన్నారు.
తారకరత్నకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ముందుగా ఒక అమ్మాయి పుట్టిందని.. ఆ తరువాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి కవలలుగా జన్మించారని అన్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు ఉన్నారని ఆయన అన్నారు.
తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటినుంచి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు.
బాలకృష్ణ చాలా మంచివారిని.. తన సొంత కొడుకు కాకపోయినా కూడా తారకరత్న ఆరోగ్యం బాగోలేదు అని తెలిసినప్పటి నుంచి ఆయన వెన్నంటే ఉండి మెరుగైన వైద్యం అందేలాగా చూశారు. అంతేకాదు తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత కూడా తనే చూసుకుంటానని చెప్పారు.
ఆ పిల్లల ఆలనా పాలనతో పాటు తారకరత్న కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి.. అందరి మన్ననలు పొందుతున్నారని విజయసాయి రెడ్డి బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తారకరత్న కుటుంబం మా కుటుంబంలో ఒక భాగం అని బాలకృష్ణ చెప్పారు. అలేఖ్య రెడ్డిని ఆమె పిల్లలను వారి బాగోగులను తాము చూసుకుంటామని తెలిపారు. వారితో తత్సంబంధాలు ఉంటాయని చెప్పడం నిజంగా గొప్ప విషయం. బాలకృష్ణ కు తారకరత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుందని విజయ్ సాయి రెడ్డి తెలిపారు.