Roja : సీనియర్ హీరోయిన్ ప్రజెంట్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… నగరి ఎమ్మెల్యేగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. రోజా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రోజా తన కూతురితో కలిసి చేసిన అల్లరి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రోజా ముద్దుల కూతురు అన్షు మాలిక.. రోజాకు మాదిరిగానే అన్షు కూడా తన హావభావాలను అందజేయడానికి ప్రతిభ పట్టుదలను పునికి పుచ్చుకుంది.. ఇప్పటికే అన్షు పలు అరుదైన గౌరవాలను కూడా సొంతం చేసుకుంది. ఇన్ఫ్లుయెన్స్ యూకే మ్యాగజైన్ కవర్ పై అన్షు మాలిక ఫోటోలు కూడా ప్రచురించారు. అన్షు మాలిక గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆమె రైటర్ గా, ప్రోగ్రామర్ గా, ఎంటర్ ప్రేన్యూర్ గా కూడా సత్తా చాటారు. అందుకే చిన్న వయసులోనే యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికై ఆ అవార్డును కూడా సొంతం చేస్తుంది.
అన్షు మాలిక చిన్నతనం నుంచి గొప్ప ప్రతిభను కనబరుస్తూనే ఉంది. ఆమె స్కూల్ నుంచి కాలేజ్ వరకు తన క్లాసులో అన్షు మాలికనే ఫస్ట్. అందుకే బర్న్ ఎచీవర్ మ్యాగజైన్ కూడా అన్షు మాలిక గురించి రాస్తూ ఆమె క్వీన్ ఆఫ్ టాలెంట్ అని పేర్కొంది. పైగా తమ బుక్ కవర్ పేజీ పై అన్షు మాలిగా ఫోటోలు కూడా ఘనంగా ప్రచురించింది. సినిమాల్లోకి ఎంట్రీస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తనకి సినిమాలపై ఆసక్తి లేదని.. తను కూడా తల్లి రోజా లాగే రాజకీయాల్లో రాణించాలని ఆశపడుతుంది. అందుకే తనకు తల్లి స్ఫూర్తిని అని తన తల్లి పట్టుదలే తన భవిష్యత్తుకు లక్ష్యం అంటుంది అన్షు.
మంత్రి రోజా తన కూతురు అన్షు ఇంట్లో ఎలా ఉంటారు. ఎలా ఇద్దరూ కాలక్షేపం చేస్తారు.. వారి వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకుంటారు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఓ వీడియో ను రోజా పంచుకోగా.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.