Mahesh Babu : మహేష్ బాబు పాదాలను కన్నీటితో కడిగిన అన్నదమ్ములు..!!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే.. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి టెలివిజన్ షో కి హాజరయ్యారు.. జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ షోకు మహేష్ బాబు గేస్ట్ గా హాజరయ్యారు.. మహేష్ తో పాటు తన ముద్దుల తనయ సితార కూడా ఈ షోకి హాజరైంది.. మహేష్ బాబు ఈ షోలో సందడి చేశారు.. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు షోలో ఇద్దరి అన్న తమ్ముళ్లకు ఎవ్వరూ ఊహించని వరం ఇచ్చాడు.. డాన్స్ ఇండియా డాన్స్ షోలో మైఖేల్ బాబు అతని తమ్ముడు ఇద్దరు కలిసి ఓ సైకో ఎక్స్ప్రెషన్స్ తో కూడిన సాంగ్ అటెంప్ట్ చేశారు..

అంతే కాదు వారిద్దరి ఏవి చూసి మహేష్ చలించి పోయారు.. మత్స్యకారులైన వాళ్ళు డాన్స్ కోసం పడిన ఆరాటం తెలుసుకొని.. నిజంగా మీరు ఈ పాటలో నటించలేదు. జీవించేసేసారు అని మహేష్ అన్నారు.. అంతే కాదు నేను నటించబోయే సినిమాలో కానీ, ముందు ముందు చేసే సినిమాలలో కానీ మీకు కచ్చితంగా అవకాశం ఇస్తాను అని మహేష్ ఓ వరం ఇచ్చాడు.. ఇక వెంటనే వాళ్ళిద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లి మహేష్ కాళ్ళపై పడ్డారు.. వారి కన్నీళ్ళతో మహేష్ బాబు పాదాలను కడిగారు.. మైకిల్ బాబు మిమ్మల్ని ముట్టుకోవచ్చని మహేష్ బాబును అడగగా.. తప్పకుండా అని మహేష్ బాబు హగ్గు కూడా ఇచ్చాడు.. మరోసారి మహేష్ కాళ్లపై పడి ఏడ్చేశారు.‌

Michael Babu dance India dance participants Mahesh Babu give movie chance on her film
Michael Babu dance India dance participants Mahesh Babu give movie chance on her film

ఒక్కసారిగా తనని హత్తుకోగానే ఆనంద భాష్పాలు తన కంటి నుంచి వచ్చేసాయి.. మీ ముందు మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావడం లేదు సార్.. మీరు నిజంగా కనిపించే వెంకటేశ్వర స్వామి అని మైఖేల్ అన్నాడు.. వెంటనే బాబా మాస్టర్ మీరు ఎన్ని రోజులు పడినా శ్రమకి ప్రతిఫలం ఇది.. అందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి.. కచ్చితంగా ఒక రోజు విజయం వరిస్తుంది అని అంటాడు.. వెంటనే మహేష్ బాబు గారు నాకు కూడా మీ సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇవ్వండి అని బాబా మాస్టర్ అడుగుతాడు.. నా టాలెంట్ ని నేను ప్రూవ్ చేసుకుంటాను అని బాబా మాస్టర్ అనగానే.. తప్పకుండా అని మహేష్ బాబా మాస్టర్ కి కూడా వరం ఇస్తాడు..

Advertisement