గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత చిరంజీవి రియాక్షన్ ఏంటంటే..!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.. తాజాగా ఈ సినిమా ఫైనల్ కాపీ సిద్దమనట్టు అది కూడా చిరంజీవి చూసినట్టు తెలుస్తుంది.. ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన చిరు ఏమన్నారంటే.!?

    Megastar Chiranjeevi watched God Father movie final copy and her comments Megastar Chiranjeevi watched God Father movie final copy and her comments

ఫైనల్ కాపీ చూసిన చిరంజీవి ఎలాగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారట.. చిరు తుది కాపీ చూసిన తర్వాత సినిమా అద్భుతంగా వచ్చిందిని.. గ్రిప్పింగ్ గా ఉందని డైరెక్టర్ మోహన్ రాజాని ప్రశంసించారని టాక్.. ఈ సినిమా ఔట్ పుట్ ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అలాగే ఉందని మెచ్చుకున్నారట చిరు.. గాడ్ ఫాదర్ సినిమాను అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కోసం ఏదో ఒక అప్డేట్ వదులుతూనే ఉంది చిత్ర యూనిట్.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షక ఆదరణ ఎంతగానో పొందింది.. ఈ సినిమాలోని నయనతార లుక్ ను రివిల్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది..

ఆచార్య ఫ్లాప్ అవ్వడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే సముద్ర ఖని, సత్య దేవ్, సునీల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.. ఈ సినిమా అక్టోబర్ 5న బాక్స్ ఆఫీస్ ను డీ కొట్టడానికి సిద్దమైంది.. ఇక ప్రమోషన్స్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది..

Advertisement