Chiranjeevi : ఆస్తి విషయం లో చిరు ఇంట్లో బిగ్ వార్ ? పిచ్చ కోపంగా ఉన్న పెద్ద కూతురు సుష్మిత ??

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ఉంది.. అంతకన్నా మెగాస్టార్ కి గౌరవ మర్యాదలు ఉన్నాయి. మెగాస్టార్ కాంట్రవర్సీలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు. అసలు వాటిని పెద్దగా పట్టించుకోరు కూడా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన పిల్లల కారణంగా చిరంజీవి వివాదాల్లో చిక్కుకుంటున్నారట.

mega star chiranjeevi property disputes on her daughter sushmitha
mega star chiranjeevi property disputes on her daughter sushmitha                                                                                   

చిన్న కూతురు శ్రీజ వల్లే ఇప్పటికే రెండుసార్లు పరువు పోగొట్టుకున్నారు మెగాస్టార్. శ్రీజ అప్పట్లో ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. సంఘటనతో చిరు ఇంగ్లీష్ మొత్తం డామేజ్ అయింది ఆ తర్వాత శ్రీజ అతని నుండి విడిపోయి చిరంజీవి దగ్గరికి రావడం.. చిరంజీవి కూతురుకి కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి చేశారు. ఇటీవల కళ్యాణ్ దేవ్ తో కూడా విడిపోయింది. శ్రీజ విడాకులు తీసుకోకపోయినా ఇద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు.

దాంతో చిరంజీవి ఆమె విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు. శ్రీజ జీవితం లో ముందుకెళ్లాలని.. తన చిన్న కూతురు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని.. చిరంజీవి తన పేరు మీద ఉన్న సగం ఆస్తిని శ్రీజకి రాయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో రామ్ చరణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు అంటగాని పెద్ద కూతురు సుష్మిత మాత్రం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

చిన్న కూతురుకు ఆస్తంతా ఇస్తే మిగతా వాళ్లంతా ఏమైపోతారు . శ్రీజకు ఎంత అయితే ఆస్తిని ఇస్తారో నాకు కూడా అంతే ఆస్తి ఇవ్వాలని సుష్మిత పట్టు పట్టిందట. ఈ విషయాలు చిరంజీవి బయటకు చెప్పలేక సతమతమవుతున్నారట ఇద్దరు కూతుళ్లకు ఆస్తి ఇస్తే కొడుకు పరిస్థితి ఏంటి అనేది చిరంజీవి ఆవేదన. ఈ విషయాలను బయట పెట్టలేక చిరంజీవి పంటి బిగువున పట్టుకున్నారు.