Pawan Kalyan : పవన్ – హరీష్ మూవీ నుంచి మాసివ్ అప్డేట్.. ఫాన్స్ కి పూనకాలే..! 

Pawan Kalyan : ఈరోజు ఉదయమే టాలీవుడ్ లో మరో భారీ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే గత వారం కూడా సరిగ్గా ఇదే ఆదివారం గాడ్ ఆఫ్ మాసేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో “ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ” అనే ప్రాజెక్టు అనౌన్స్ కావడంతో సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా షేక్ అయింది. అయితే దీని తర్వాత ఇదే ఆదివారం రోజున దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ ఆల్రెడీ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ నుంచి ఇప్పుడు ఒక తాజా అప్డేట్ రావడం గమనార్హం. అయితే ఒకపక్క థేరీ సినిమా రీమేక్ అంటూ అభిమానులు భయపడినప్పటికీ.. ఇప్పుడు మాసివ్ అనౌన్స్మెంట్ ఇచ్చి చిత్ర యూనిట్ అభిమానులకు పూనకాలు తెప్పించింది.

Massive update from Pawan - Hareesh movie..!
Massive update from Pawan – Hareesh movie..!

నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి ” ఉస్తాద్ భగత్ సింగ్” అంటూ క్రేజీ పోస్టర్ తో ఇప్పుడు అనౌన్స్ చేశారు. పైగా గతంలో డిజైన్ చేసిన పోస్టర్ తరహాలోని దీనిని కూడా డిజైన్ చేశారు. కాకపోతే టైటిల్ మార్చడం జరిగింది. అంతేకాదు కొత్తగా మనల్ని ఎవడ్రా ఆపేది అనే కొత్త ట్యాగ్ ను కూడా యాడ్ చేయడం విశేషం. మరి ఇదే సినిమా టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ కాంబినేషన్లో సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.