Manchu Manoj : గత కొద్ది రోజులుగా మంచు మనోజ్.. భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మంచు మనోజ్ కుటుంబంలో చెప్పగా వారు అంగీకరించలేదని.. అందుకే కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడు మంచు మనోజ్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల మళ్ళీ ఆ కుటుంబంలో కలిసే ప్రయత్నం చేస్తున్నా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ భూమా మౌనిక తో మంచు మనోజ్ మీడియా కంటే పడడంతో త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మంచు మనోజ్. త్వరలోనే కొత్త సినిమాలను ప్రారంభిస్తున్నానని.. అదే సమయంలో కొత్త లైఫ్ కూడా ప్రారంభిస్తున్నానని ఆయన కామెంట్లు చేయడం జరిగింది. దీంతో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు మనోజ్, మౌనికల పెళ్లి వచ్చే ఏడాది అనగా 2023 ఫిబ్రవరి 2వ తేదీన జరగనుంది అని కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మ్యారేజ్ విషయంపై ఆయన స్వయంగా స్పందిస్తే తప్ప ఈ వివరాలకు క్లారిటీ లభించదు.