Mahesh babu movie : అయ్యబాబోయ్.. మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా.? తలపట్టుకున్న ఫ్యాన్స్.!

Mahesh babu movie : సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది.. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా చాలా బాగా ఆదరించారు. షూటింగ్ స్టార్ట్ నెంబర్ 13 నుంచి చిత్ర యూనిట్ ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది.. సినిమాని మొదటగా యాక్షన్ సీన్స్ తో ప్రారంభించినట్లు సమాచారం..

ఈ క్రమంలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్ ను దసరా తర్వాత చేసేటట్లుగా యూనిట్ ప్రకటన ఇచ్చింది.. తొలి రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ పూర్తి కావడంపై ఊహాగానాలు వెలుగోడుతున్నాయి.. ఫైట్స్ సీన్స్ చేశారా లేదా అంతా ఉత్తితెనా అని అంతా గుసగుసలు వినిపిస్తున్నాయి.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. పైగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీలో కూడా మంచి టాక్ నెలకొంది.. ఈ సినిమ కోసం మహేష్ మరింత అందంగా కనిపించాలని మెక్ ఓవర్ కూడా ఛంజ్ చేసుకున్నాడు..

Mahesh Trivikram movie stopped fans upset
Mahesh Trivikram movie stopped fans upset

ఇప్పటివరకు చేసిన ఫైటింగ్ సీన్స్ లో మహేష్ బాబు త్రివిక్రమ్ సంతృప్తిగా లేరని సమాచారం.. అనుకున్న విధంగా ఈ ఫైట్స్ రాలేదని అందుకే షూటింగ్ కావాలని బ్రేక్ చేసిన ఫిలిం యూనిట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. నిజానికి అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్లాన్ ప్రకారం ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట.. కానీ సీన్స్ అనుకున్న విధంగా రాకపోవడం వలన షూటింగ్ కి అంతరయం ఏర్పడిందని సమాచారం.. కొంచెం సమయం తీసుకొని ప్రస్తుతం ఉన్న ఫైట్ మాస్టర్ ని కొనసాగించాలా లేక కొత్త మాస్టారుని తీసుకోవాలా అని దర్శకుడు ఆలోచింప చేస్తున్నారట. ఈ వార్తలపై ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేంత వరకు వేచి ఉండాల్సిందే..