Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనట..!!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇలా సెట్స్ పైకి వచ్చిందో లేదో అలా మహేష్ సినిమా పై ఊహగానాలు, కథనాలు మొదలయ్యాయి.. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనే అంశం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..‌ ఈ నేపథ్యంలో ఇదే ఈ సినిమా టైటిల్ అంటూ ఓ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..! ఐస్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా #SSMB28Aarambham అనే హ్యాష్ ట్యాగ్ ను మేకర్స్ బాగా పాపులర్ చేశారు.. ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ హ్యష్ ట్యాగ్ ను వైరల్ చేశారు..!!

అయితే ఆరంభం అనేది కేవలం షూటింగ్ మొదలైన సందర్భంగా పెట్టలేదని ఈ సినిమాకు ఇదే టైటిల్ పెట్టబోతున్నారని సరికొత్త ప్రచారం మొదలైంది.. దీని వెనుక కూడా ఓ చిన్న లాజిక్ కూడా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా అ అనే అక్షరంతో మొదలైంది.. కాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఆ తర్వాత వచ్చిన ఖలేజా సినిమా ఫ్లాప్ అయింది.. ఈ టైటిల్ అ అనే అక్షరంతో మొదలు కాలేదు.. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో కూడా అ అనే అక్షరం సెంటిమెంటుతోనే హిట్ అందుకున్నాడు.. అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం అనే చిత్రాలతో త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాడు..

Mahesh Babu trivikram combination movie title Arambham
Mahesh Babu trivikram combination movie title Arambham

ఇప్పుడు అదే లాజిక్ ను నేటిజన్స్ ఫాలో అవుతూ.. #SSMB28Aarambham అనే హ్యాష్ ట్యాగ్ లో ఉన్న ఆరంభం ఈ సినిమా టైటిల్ అని వైరల్ చేస్తున్నారు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా టైటిల్ ఆరంభమే నని.. ఇది ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంది.. సుమారు 12 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం.. ఆనందంతో మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా మహేష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో హారికాండ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది..

Advertisement