Sitara Ghattamaneni : మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఇంస్టాగ్రామ్ పోస్ట్ ……..!!

Sitara Ghattamaneni : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.ఈ బ్యూటిఫుల్ బ్యూటీ. విదేశాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తాజాగా సితార తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా బట్ట పంపిన డ్రెస్ వేసుకొని సితార తన పిక్ పోస్ట్ చేసింది. ఆమెకి డ్రెస్ పంపించిన ఆలియా భట్ కి థాంక్స్ చెప్పింది.

mahesh sitara insta post 
mahesh sitara insta post 

అలియా భట్ గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కుమారులకు దుస్తులు పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆలియా పంపిన ఈ పార్సెల్స్ ని జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. ఇక తన త్రిబుల్ ఆర్ పోస్టర్ రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం కూడా ఆలియా కొన్ని డ్రెస్సెస్ పంపింది.ఇప్పుడు మహేష్ బాబు, నమ్రత ల గారాల పట్టి సితారకు కూడా దుస్తులు పంపింది. వాటి ఫోటోలను సితారా తన ఇన్స్టాలో అందరి తో పంచుకుంది.మీ కుటుంబంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.

ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఆలియా భట్ పంపించిన ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కంపెనీవి కావడం విశేషం. ఒకపక్క ర్యాపో మెయింటెన్ అవుతోంది. మరోపక్క ప్రమోషన్ కూడా జరుగుతుంది. అలా ఆర్యలెక్క అదిరిందన్నమాట. ఇక గత ఏడాది బాలీవుడ్ హీరో రన్వీర్ కపూర్ ని పెళ్లాడిన ఆలియా భట్ కి ఓ కూతురు జన్మించింది. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు.