Mahesh Babu : రాజమౌళి – మహేష్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అంటున్న అల్లు అరవింద్..!

Mahesh Babu : RRR ఆస్కార్ అవార్డు గురించి వేదికపై సమావేశాలు గురించి తాజాగా అల్లు అరవింద్ మాట్లాడుతూ… నిర్వాహకులుది ఎంత అన్యాయం అంటే.. నేను ఒక పావుగంట క్రితమే ఇక్కడికి వచ్చినప్పుడు.. మేము అనుకుని మీరు ఓపెనింగ్ స్పీకర్గా వెళ్తే బావుంటది అని అడిగారు. ఇదేంటయ్యా ఇది.. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చెప్తే ఎలా అనుకున్నప్పుడు.. స్పీకర్స్ ఒకలా ఉన్నారు. అయితే మన ఇండస్ట్రీ తరపున ముందు మీరు మాట్లాడితే బాగుంటది. ఆస్కార్ అది ఎక్కడ ఉంటది అది మనం కల గూడా కనలేని ఒక ఆస్కార్. మనం ఇలా అనుకుంటూ ఒక పది సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా మనం ఎప్పుడు ఆస్కార్డు తీసుకోలేం. కనీసం ఆ హాల్ ఎలా ఉంటుందో.? చూసి వద్దామని వెళ్లి టికెట్ తీసుకుని ఆ హాల్లోకి వెళ్లి ఇక్కడేనా ఆస్కార్ తీసుకునేది అని అనుకున్నాను.

అంటే మనం కలలో కూడా కనలేనిది. కనీసం ఆ చోటు అయినా చూద్దాం.. అని ఒక తృప్తితో అక్కడికి వెళ్లాను. అయితే ఇవాళ మనం అందరూ గర్వించే మన రాజమౌళి అండ్ యూనియన్ వాళ్ళందరూ అక్కడ ఆస్కార్ హాల్లో కూర్చుని అక్కడ రాజమౌళి,చంద్రబోస్,కీరవాణి , నా మేనల్లుడు రామ్ చరణ్ మన లవబుల్ హీరో ఎన్టీఆర్ వీళ్లందరిని ఆ స్టేజ్ మీద చూడగానే నా కడుపు నిండిపోయింది. మన తెలుగు ఇండస్ట్రీకి ఎంత సాధించిందో. అది ఒకటి అయితే ఇవాళ దానికి ఒక ఆస్కార్ అని ఏర్పడింది.ఎవరు ఊహించలేని అంత ఎత్తుకి ఎదిగి అందులో మన కీరవాణి గారు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అంటున్నారు.

 

ఈ కీరవాణి గారి గురించి.. ప్రపంచమంతా ఇంటర్నెట్లో ఎవరా కీరవాణి అని వెతుక్కునే అంత ఎత్తుకు ఎదిగాడు. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ పాటలు రాయాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు .. మేము కూర్చోబెట్టుకొని దబాయించుకుంటూ.. ఇంకొకటి రా ఇంకొకటి రా అనుకుంటూ ఉన్న ఆ చిన్న కుర్రోడు ఇవాళ ఎంతో ఎత్తుకి మనల్ని తీసుకెళ్లి ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చిన మహానుభావుడు.. ఏది ఏమైనా ఆస్కార్ని సాధించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇక రాజమౌళి తదుపరిచిత్రం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ను మించిపోతుంది తెలుగు సినిమాను ప్రపంచం మరొకసారి గర్వించేలా చేస్తుంది అంటూ అల్లు అరవింద్ ప్రశంసల కురిపించారు.