Mahesh Babu : మహేష్ నాగార్జున మల్టీస్టారర్ కిర్రాక్ అప్డేట్..

Mahesh Babu : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారన్న టాక్ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల నాగార్జున నటిస్తున్న ది గోస్ట్ ట్రైలర్ను ట్విట్టర్ వేదికగా మహేష్ విడుదల చేశారు ఈ సినిమా హిట్ కావాలని కూడా కోరారు . మహేష్ చేసిన ట్వీట్ కు నాగార్జున థాంక్యూ చెప్పారు.

అంతే కాకుండా మహేష్ బాబు ట్వీట్ కి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని కూడా యాడ్ చేశారు. 29 ఏళ్ల కిందట వారసుడు సినిమాలో మీ నాన్న సూపర్ స్టార్ కృష్ణ నాతో కలిసి నటించినప్పుడు ఎంతో సంతోషించానని చెప్పారు. మనం కలిసి ఓ సినిమా ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించారు నాగార్జున అటు ఇటు మహేష్ బాబు స్పందించారు ఇది చాలా సంతోషకరం ఆ సమయం రావాలని ఆశిద్దాం అన్నట్లుగా మహేష్ బాబు రిప్లై ఇచ్చారు దాంతో నాగార్జున ప్రతిపాదనకు మహేష్ ఓకే చెప్పారని అందరూ అనుకున్నారు.

ఇక ది గోస్ట్ సినిమా విడుదలవ్వడం ఆ సినిమా మంచి హిట్ కూడా అందుకుంది. ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో మరోసారి ఈ ప్రశ్న నాగార్జునకు ఎదురయింది. అభిమానులు నాగార్జునని మహేష్ తో మీ సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు బదులుగా మహేష్ ఎప్పుడు అంటే అప్పుడు నాకు ఓకే అని నాగార్జున రిప్లై ఇచ్చారు.

అంటే ఈ సినిమా కథకు మహేష్ ఓకే చెప్పాలని నాగార్జున ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. నేనెప్పుడూ ముందే ఉంటానని.. మహేష్ ఈ సినిమా కథను ఓకే చేసి ఫైనల్ చేస్తే ఇద్దరం కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తాం అనే ఉద్దేశంతో నాగార్జున ఈ మాటలు మాట్లాడారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా త్వరగా మహేష్ ఈ సినిమా కథకి ఓకే చేస్తే ఇద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాకి త్వరగా శ్రీకారం చుడతారని మహేష్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్..