Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మహర్షి.. తాజాగా మహేష్ బాబు ,శివా ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహేష్ అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడడం ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది.
యాంకర్ మహేష్ బాబును ప్రశ్నిస్తూ ఈ సినిమాలో మీరు సీఎం మీకు ఆ ఆలోచన ఎలా అనిపించింది అని అడుగుతారు. మనుషుల జీవితానికి రాజకీయాలకి దగ్గర ఉంటుంది అలాంటి ప్రజల జీవితాన్ని మార్పు చేయగలిగే సీఎం పాత్రలో మీరు కనిపించడం మీకు ఏమనిపించింది అని అడగగా . ఫస్ట్ సీఎం అని అనగానే నాకు చాలా నవ్వొచ్చింది. నేను ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ లో నటిస్తానని అనుకోలేదు. ఇదంతా డైరెక్టర్ క్రెడిట్ అని అంటారు మహేష్..
ఈ సినిమా విడుదల అవ్వాల్సిన సమయంలోనే అల్లు అర్జున్ సినిమా కూడా విడుదల అవ్వాల్సి ఉంది. ఇక ఆ సినిమా డైరెక్టర్ మా సినిమా డైరెక్టర్ ఇద్దరు మాట్లాడుకొని ఒక వారం రోజులు మీ సినిమానే ముందు రిలీజ్ చేయండి. మా సినిమాని మరో వారం రోజులు పోస్ట్ ఫోన్ చేస్తామని.. రెండు సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ వచ్చేలాగా చూసుకున్నారు. అలా ఏప్రిల్ 20వ తారీఖున మా సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. ఏప్రిల్ 20వ తారీకు మా అమ్మ పుట్టినరోజు అని మా అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది.
ఇక అదే విషయాన్ని మా డైరెక్టర్ కి ఫోన్ చేసి చెబితే అయితే సినిమా హిట్ అవ్వడం ఖాయమని ముందే చెప్పేశారు. అనూహ్యంగా ఆరోజు అమ్మ చేతితో నేను కాఫీ తాగడం.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం జరిగింది అని మహేష్ మరోసారి వాళ్ల అమ్మ చేతి కాఫీ ని గుర్తు చేసుకున్నారు. ఇక ఆరోజు రాత్రి నమ్రత అస్సలు నిద్రపోలేదు రాత్రంతా మేలుకొని అటు ఇటు తిరుగుతూనే ఉంది. నా దగ్గరికి వచ్చి ఏడ్చేసింది కూడా యూఎస్ లో ఈ సినిమా సూపర్ హిట్ అని తన ఫ్రెండ్స్ మెసేజ్ చేశారని చెప్పి సంతోష పడింది. ఇక ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక తన రివ్యూ టెరీఫిక్ అని చెప్పడంతో నిజంగానే ఈ సినిమా హిట్ అవుతుందని ముందుగానే అనుకున్నమని మహేష్ ఆ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు.