Namratha : సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నమ్రత.. ఆ తరువాత మహేష్ బాబు ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు దూరమైనా భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతుంది నమ్రత..
మహేష్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలతో పాటు బిజినెస్ పనులను కూడా తనే చక్కబెడుతుంది. నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్తూ చేస్తునే ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా నమ్రత తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయింది.
నమ్రత తన తండ్రి నితిన్ శిరోద్కర్‌ను ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ. 16 ఏళ్లుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నా పప్పా.. నీ ప్రతి జ్ఞాపకం నా మదిలో అలాగే పదిలంగా ఉంది. ఏమీ మారలేదు. నువ్వు చాలా త్వరగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావు పప్పా. ప్రతి రోజూ అనంతమైన ప్రేమను, వెలుగులను నిత్యం నీకు పంపిస్తూనే ఉంటాను అని నమ్రత చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.