Mahesh Babu : మహేష్ లేకుండానే వెకేషన్ కి వెళ్ళినా నమ్రత, సితార..

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదంటే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఏడాదిలో కనీసం నాలుగు సార్లు అయినా కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు. తాజాగా మహేష్ బాబు ని షూటింగ్ లో వదిలేసి ఆయన భార్య నమ్రత సితార ఇద్దరు కలిసి వెకేషన్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Mahesh Babu wife namrata and sithara photos viral
Mahesh Babu wife namrata and sithara photos viral

తాజాగా నమ్రత, సితార ఇద్దరూ కలిసి ఎయిర్పోర్టులో సందడి చేశారు ఇద్దరు వెకేషన్కు వెళ్ళినట్లు సమాచారం. మహేష్ బాబు సినిమాలో బిజీగా కొడుకు గౌతమ్ విదేశాలలో చదువుకుంటూ అక్కడే ఉంటున్నాడు. అయితే ఎప్పుడు వెకేషన్ కి వెళ్ళినా కుటుంబం తో పాటు కలిసి అంతా వెళ్లేవారు. కానీ ఈసారి మహేష్ బాబు లేకుండా నమ్రత సితార వెకేషన్ కి వెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

Advertisement

నమ్రత, సితార ఇద్దరూ కలిసి గౌతమ్ దగ్గరకు వెళ్తున్నారా లేదంటే ఫారెన్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సితార నమ్రత ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు మహేష్ వేలనందుకు ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మహేష్ త్వరగా సినిమాలను కంప్లీట్ చేస్తారన్న ఆశతో..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో వరుస షూటింగ్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisement